పెళ్లింట తీవ్ర విషాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరిలో అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించి ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Massive Fire | పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరిలో అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించి ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్ (Bihar) రాష్ట్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
దర్భంగా ()లోని బహెరా ప్రాంతంలోగల అలీనగర్‌లో గురువారం రాత్రి 11:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేడుకలో భాగంగా రాత్రి పటాకులు కాల్చారు. ఆ నిప్పు రవ్వలు పెళ్లి పందిరికి అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. లోపల ఉంచిన కొన్ని మండే పదార్థాల కారణంగా మంటలు వేగంగా మండపం మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సునీల్ పాశ్వాన్ (26), లీలాదేవి (23), కంచన్ దేవి (26), సిద్ధాంత్ కుమార్ (4), శశాంక్ కుమార్ (3), సాక్షి కుమారి (5)గా గుర్తించారు. అగ్ని ప్రమాదంలో మూడు ఆవులు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Also read
- విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
- AP News : మహిళల న్యూడ్ వీడియోస్..డాక్టర్ ను చితక్కొట్టి..
- ఊడదీయడానికి అరటి తొక్క కాదు.. జగన్ కు ఎస్ఐ వార్నింగ్
- నాలుగు రోజుల్లో నిశ్చితార్థం.. కార్యదర్శి అనుమానాస్పద మృతి
- Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య