హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ రెస్టారెంట్లో భారీ పేలుడు సంభవించింది. ఎల్బీనగర్లోని చట్నీస్ రెస్టారెంట్లో పేలుడు జరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం రెస్టారెంట్ ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనలకు గురైన సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. పేలుడు శబ్దానికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటీన సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
సుమారు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కోర్టు పక్కన ఉన్న చట్నీస్ హోటల్ కిచెన్లో ఇడ్లీ తయారు చేసే స్టీమర్ పేలిపోయింది. ఇందులో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఎన్టీఆర్ నగర్లోని ఆద్య ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరూ ప్రమాదం నుండి బయటపడ్డారు. వారు చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారని రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది.
Also read
- Mantralayam మానవత్వన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి…(video)
- 30వ ప్లోర్ నుంచి పార్క్ చేసిన కారుపై పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి.. షిఫ్టైన రెండ్రోజులకే
- Telangana: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన భార్య!
- మామ హత్య కోసం రూ.5 లక్షల సుపారి… పచ్చని సంసారంలో చెడు వ్యసనాల చిచ్చు..
- హైదరాబాద్లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..





