SGSTV NEWS online
CrimeNational

పెళ్లి అయినా తొమ్మిది నెలలకే వివాహిత ఆత్మహత్య..



కర్ణాటక : పెళ్లయిన 9 నెలలకే నవ వివాహిత వరకట్నం వేధింపులకు బలైన విషాద సంఘటన బెంగళూరు కోణనకుంటలో జరిగింది. శిరీషా (23) మృతురాలు. వివరాలు..

ఓ అపార్ట్‌మెంట్‌లో భర్త ప్రశాంత్, అత్త రుక్మిణితో కలిసి ఆమె నివసిస్తోంది. పుట్టింటి నుంచి మరింత వరకట్నం తేవాలని తమ కుమార్తెను వేధించేవారని శిరీషా తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం శిరీషా ఉరివేసుకున్న స్థితిలో ప్రాణాలు విడిచింది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. 

Also read

Related posts