స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ వికృత చేష్టలు బయటపడ్డాయి. పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కిరణ్.. వేరే మహిళలతో ఉన్న ఫోటోలు భార్య అనసూయరాణికి పంపి వేధింపులకు గురిచేస్తున్నాడు.
స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ వికృత చేష్టలు బయటపడ్డాయి. పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కిరణ్.. వేరే మహిళలతో ఉన్న ఫోటోలు భార్య అనసూయరాణికి పంపి వేధింపులకు గురిచేస్తున్నాడు. భార్యాబిడ్డలను రోజూ చావ బాదుతూ చిత్రహింసలు పెడుతున్నాడు కిరణ్. ఇందులో భాగంగానే గత రాత్రి సైతం భార్యను చితకబాదాడు కిరణ్. భర్త దాడిలో స్పృహ కోల్పోయిన అనసూయరాణిని వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిరణ్ భార్యకు చికిత్స అందించారు వైద్యులు.
అనంతరం అనసూయరాణి తన భర్తపై గుంటూరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనసూయరాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కిరణ్ కుమార్. అనసూయరాణి ప్రస్తుతం ఎల్ఐసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తుంది. పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. తన మీద ఫిర్యాదు చేసిన భార్యకు అండగా వచ్చిన బంధువులపై.. అట్రాసిటీ కేసు పెడతానని కిరణ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు
పిల్లలు పుట్టకపోవటంతో.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అనంతరం అనసూయరాణి మీడియాతో మాట్లాడుతూ… తామిద్దరం ప్రేమ వివాహం చేసుకున్నామని వెల్లడించారు. తనకు పిల్లలు పుట్టకపోవటంతో ఓ పాపను దత్తత తీసుకున్నామని 2012లో సరోగసీ ద్వారా ఓ బాబుకు పుట్టినట్టుగా తెలిపారు. అయితే కొన్నేళ్లుగా వేరే మహిళలతో తన భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె అవేదన వ్యక్తం చేశారు. తన భర్త పెట్టే టార్చర్ తాళలేక పది నెలల నుంచి వేర్వేరుగా ఉంటున్నట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం పాప విదేశాల్లో చదువుకుంటుండగా, బాబు తనతోనే ఉంటున్నాడనిఅనసూయరాణి చెప్పుకొచ్చారు. రెండు రోజుల కిందట తన బంధువుల ఇంటికి వెళ్తుంటే అడ్డుకుని బాబును, తనను తన భర్త కొట్టాడని అనసూయరాణి తెలిపారు.
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్‌లో.. భార్య కడపలో.. డ్రైవర్‌తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





