కంకిపాడు: కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు గ్రామం శివారులో ఉన్న గేదెల ఫారంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని బిహార్కు చెందిన అనిల్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇతడిపై దుండగుడు పలుమార్లు కత్తితో పొడిచాడు.
స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- చోరీ అట్టర్‌ప్లాప్.. అద్దెకుంటూ యజమాని ఇంట్లోనే దొంగతనం.. చివరకు ఒక్క ఫోన్ కాల్‌తో దొరికిపోయాడు..!
- మోపిదేవిలో విషాదం.. ఆ అమ్మకు కడుపు కోత
- కత్తితో దాడిలో బిహార్ వాసి మృతి
- చిల్లర డబ్బుల విషయంలో ఘర్షణ: ఒకరి మృతి
- ఆకాశ దీపం అంటే ఏంటి ? కార్తీకంలోనే దీన్ని ఎందుకు వెలిగిస్తారో తెలుసా?





