SGSTV NEWS online
CrimeTelangana

చిల్లర డబ్బుల విషయంలో ఘర్షణ: ఒకరి మృతి



హైదరాబాద్‌లో పండుగ పూట ఒక కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లిన వ్యక్తి.. వైన్స్ షాపు వద్ద జరిగిన ఘర్షణలో సిబ్బంది దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. పండుగ పూట మద్యం తాగి సరదాగా గడపాలనుకుంటే ఏకంగా ప్రాణం పోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



అసలేం జరిగిందంటే..హైదరాబాద్‌లోని అత్తాపూర్ పిల్లర్ నంబర్ 140 సమీపంలో ఉన్న ఒక వైన్ షాప్‌లో మద్యం కొనేందుకు నాగరాజు (45) అనే వ్యక్తి వెళ్లాడు.  మద్యం కొనుగోలు చేయడానికి వచ్చిన నాగరాజుకు, వైన్ షాప్ సిబ్బందికి మధ్య చిల్లర డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం ముదిరి ఘర్షణకు దారితీసింది.

ఈ క్రమంలో వైన్స్ సిబ్బంది దాడి చేయడంతో  గుండె భాగంలో తీవ్రమైన గాయం కావడంతో నాగరాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటివారు వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, పరీక్షించిన డాక్టర్లు అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ దారుణ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Also read

Related posts