హైదరాబాద్: గోవాకు వెళ్లిన ఓ జంట కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలను రహస్యంగా తీసి రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్న గోవాకు చెందిన ఓ వ్యక్తిపై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..సనత్నగర్ పోలీస్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డకు చెందిన ఓ మహిళ (35) తన వివాహం కాకముందు 2023లో శ్రీనాథరావు అనే వ్యక్తితో కలిసి గోవాకు వెళ్లింది. వీరికి గోవాలోని యశ్వంత్ (40) అనే వ్యక్తి వసతితో పాటు ఇతర ఏర్పాట్లను చేశాడు. అదే సమయంలో ఆ జంట కలిసి ఉన్నప్పటి వీడియోలను రహస్యంగా తీశాడు.
ఈ వీడియోలను భద్రపరిచిన యశ్వంత్ తాజాగా శ్రీనాథరావుకు ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇదిలా ఉండగా సదరు మహిళకు గత ఏడాది వేరొకరితో పెళ్లి జరిగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన బెదిరింపుల విషయాన్ని శ్రీనాథరావు ఆ మహిళ దృష్టికి తీసుకువచ్చాడు. భయాందోళనకు గురైన బాధితురాలు సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు యశ్వంత్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





