• ప్రియుని మొబైల్ దోపిడీ
• ప్రైవేటు ఫోటోలు తొలగించాలని ప్లాన్
దొడ్డబళ్లాపురం: ప్రియునితో గొడవలు వచ్చి ఓ యువతి. అతని ఫోన్ ని చోరీ చేయించింది. చివరకు 2, ఆమె ముఠా దొరికిపోయిన సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. వివరాలు.. మహిళా టెక్కీ శృతి, సహోద్యోగి వంశీక్రిష్ణతో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. షికార్లకు, ఎన్నో పర్యాటక స్థలాలను సందర్శించారు. వందల కొద్దీ సెల్ఫీలు, రొమాంటిక్ భంగిమల్లో వీడియోలు తీసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోవాలని శృతి నిర్ణయించుకుంది. కానీ ప్రియుని ఫోన్లో ఉన్న ఫోటోలు, వీడియోలు చూపించి తనను ఇబ్బంది పెడతాడేమోనని ఆమె భయపడింది.
దారికాచి దోపిడీ
ఈ నేపథ్యంలో ఇద్దరూ బైక్ లో బెంగళూరు బోగనహళ్లి వద్ద వెళ్తుండగా ఒక కారులో వచ్చిన నలుగురు యువకులు బైక్ను ఢీకొని గొడవకు దిగారు. వంశీక్రిష్ణ వద్ద ఉన్న రూ. 90 వేల విలువైన మొబైల్ లాక్కుని పరారయ్యారు. మొబైల్ పోతేపోయింది వదిలెయ్ అని యువతి ప్రియున్ని బుజ్జగించింది. అయితే వంశీక్రిష్ణ బెళ్లందూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నంబర్ ఆధారంగా సురేశ్, మనోజ్, వెంకటేశ్, హొన్నప్ప అనే నలుగురు యువకులను అరెస్టు చేశారు. శృతినే తమను మొబైల్ దోచుకోవాలని, ఆ తరువాత ఫోన్ లోని న డేటాను తొలగించాలని చెప్పిందని తెలిపారు. శృతిని, దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రియురాలి ఘనకార్యంతో ప్రియుడు తెల్లబోయాడు.
Also Read
- ఇదేం పనయ్యా.. ప్రభుత్వ ఉద్యోగంలో లక్షకుపైగా జీతం.. చేసేదేమో చైన్ స్నాచింగ్లు
- 5 నెలలుగా ఇంటికి తాళం.. అనుమానంతో తెరిచిన ఓనర్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే దృశ్యం!
- ఏపీ లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
- అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు
- చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం.. బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు.. బాలుడి చేయి ఛిద్రం!





