అమ్మా.. క్షమించు..
నెల్లూరు జిల్లాలో ఘటన
చిల్లకూరు: ‘అమ్మా.. నన్ను
క్షమించు.మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా.ఎందుకో కూడా సరైన కారణం చెప్పలేను. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్ నోట్లో రాసి సచివాలయంలో పనిచేసే ఏఎన్ఎం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తొణుకుమాలలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. తిరుపతి జిల్లా ఓజిలి మండలం రాజుపాళేనికి చెందిన శ్రీపతి రమణయ్య ద్వితీయ కుమార్తె సాయి చందనప్రియ (27) ఏడాది క్రితం తొణుకుమాల సచివాలయానికి ఏఎన్ఎంగా బదిలీపై వచ్చింది. అప్పటి నుంచి ఆమె స్థానికంగా పనిచేసే వారితో పాటు చింతవరం వైద్యులతో కలిసి సచివాలయంలోనే మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం చేసేది.
గురువారం తాను మరోసారి భోజనం చేస్తానని ఆశ వర్కర్లకు చెప్పి వారిని గ్రామంలోని పాఠశాలకు పంపేసింది. సచివాలయ సిబ్బంది మండల పరిషత్లోని సమావేశంలో ఉండగా.. అగ్రికల్చర్ అసిస్టెంట్ పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లారు. సచివాలయంలో ఎవరూ లేకపోవడంతో సూసైడ్ నోట్ను రాసి టేబుల్పై పెట్టి.. సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను సచివాలయానికి వచ్చిన వారు గమనించి కిందికి దింపారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో పంచాయతీ కార్యదర్శికి సమాచారమిచ్చారు.
పోలీసులు వచ్చి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకొని విషయాన్ని ఆమె కుటుంబీకులకు చెప్పారు. అక్కడికి వచ్చన కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు.
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




