Hyderabad: హైదరాబాద్ శివారులోని ఐడీఏ
బొల్లారంలో దారుణమైన ఘటన జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ.. భర్త కళ్ల ముందు దుండగులు భార్య గొంతు కోసి చంపేశారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి సైలెంట్‌గా పరారయ్యారు.అడ్డుకోబోయిన భర్తపైనా దాడి చేశారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
హైదరాబాద్ శివారులోని ఐడీఏ బొల్లారంలో దారుణమైన ఘటన
పోలీసులు చెబుతున్న వివరాల మేరకు బీహార్‌కు చెందిన అనిల్ కుమార్-మీనాదేవి దంపతులు ఐడీఏ బొల్లారం పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు. రాత్రి ఐడీఏ బొల్లారం పరిధిలో సంతకు దంపతులు వెళ్లారు. సంత తర్వాత తిరిగి టూ వీలర్ ఇంటికి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో అంటే గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్ద బైక్ ఆగిపోయింది.
అప్పటికే అక్కడున్న దుండగులు చెట్ల పొదల్లోంచి బయటకు వచ్చారు. అనిల్ కుమార్‌పై దాడి చేసి అతడి భార్యను లాక్కెళ్లారు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ మీనాదేవి గొంతుకోసి పరారయ్యారు. అడ్డుకోబోయిన భర్తపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అటువైపు వస్తున్న స్థానికులు గాయపడిన అనిల్‌కుమార్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఈలోగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడి ఫిర్యాదు నేపథ్యంలో ఐడీఏ బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ దారుణానికి తెగబడింది ఎవరు? ఎవరైనా తెలిసినవారా? లేకుంటే అనిల్ ఫ్యామిలీకి ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా? ఈ కేసు గురించి సమాచారం సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.
Also read
- గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- శ్రీకృష్ణుడిని ‘జగద్గురువు’ అని ఎందుకు అంటారు? గీతాబోధలో దాగిన జీవన సత్యాలివే
- శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026: తేదీ, శుభ ముహూర్తం, పూజ విధానం, ఉపవాసం మరియు దహీ హండి(ఉట్ల పండుగ) ప్రాముఖ్యత
- Andhra: దొంగతనానికి వచ్చాడు.. వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడగానే..





