హైదరాబాద్: గోవాకు వెళ్లిన ఓ జంట కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలను రహస్యంగా తీసి రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్న గోవాకు చెందిన ఓ వ్యక్తిపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..సనత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డకు చెందిన ఓ మహిళ (35) తన వివాహం కాకముందు 2023లో శ్రీనాథరావు అనే వ్యక్తితో కలిసి గోవాకు వెళ్లింది. వీరికి గోవాలోని యశ్వంత్ (40) అనే వ్యక్తి వసతితో పాటు ఇతర ఏర్పాట్లను చేశాడు. అదే సమయంలో ఆ జంట కలిసి ఉన్నప్పటి వీడియోలను రహస్యంగా తీశాడు.
ఈ వీడియోలను భద్రపరిచిన యశ్వంత్ తాజాగా శ్రీనాథరావుకు ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇదిలా ఉండగా సదరు మహిళకు గత ఏడాది వేరొకరితో పెళ్లి జరిగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన బెదిరింపుల విషయాన్ని శ్రీనాథరావు ఆ మహిళ దృష్టికి తీసుకువచ్చాడు. భయాందోళనకు గురైన బాధితురాలు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు యశ్వంత్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? తీర్థయాత్రల వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యాలు!
- విష్ణుమూర్తి ప్రసన్నం కావాలా? గురువారం ఈ 5 పనులు తప్పక చేయండి.. సిరిసంపదలు ఖాయం!
- గాయత్రీ మంత్రం శక్తి ఇదే.. రోజూ జపిస్తే కష్టాలు దూరమై ఐశ్వర్యం పెరుగుతుందట!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- భార్య గొంతు కోసి చంపేశాడు





