July 1, 2024
SGSTV NEWS
Andhra Pradesh

భగత్ సింగ్ పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దాం…… గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి.



        నిడదవోలు యర్నగూడెం రోడ్ లో పశువుల ఆసుపత్రి కూడలిలోని ఐ.యఫ్.టి.యు స్థూపం వద్ద భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల అంతర్జాతీయ జైలు నిబంధనలకు విరుద్ధంగా ఉరితీసి 93 సంవత్సరాలైన  సందర్భంగా ఇఫ్టూ కార్యకర్తలు నివాళులు అర్పించి , కాగడాలతో భగత్ సింగ్ వారసత్వాన్ని కొనసాగిస్తామని ప్రతిన పూనడమైనది.
         ఈ సందర్భంగా ఐ.యఫ్.టి.యు జిల్లా కమిటీ సభ్యులు తీపర్తి వీర్రాజు మాట్లాడుతూ విశాల భారతావనిని యధేచ్ఛగా దోపిడీ చేస్తున్న బ్రిటిష్ ముష్కరులను గడగడలాడించి 23 సంవత్సరాల చిరు ప్రాయంలోనే ఉరి కంబాన్ని ముద్దాడి న భగత్ సింగ్ తదితరుల విప్లవ ధీరత్వం నేటికీ ఆదర్శ మన్నారు.
    ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ నాడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు దోపిడీ పాలకులను పారద్రోలేందుకు ఎత్తిపట్టిన విప్లవబావుటా నేటికీ ఆవశ్యకమనీ, వారు కలలుగన్న సమసమాజం నేటికీ సిద్ధించలేదనీ, నేటికీ మన పాలకులు యావత్ భారత సంపదను కార్పొరేట్ లకు కట్టబెడుతూ, శ్రామిక వర్గాన్ని పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మారుస్తూ, ప్రజలు దృష్టి మరల్చేందుకు హిందుత్వ వాదాన్ని రెచ్చగొడుతూ, ప్రశ్నించే వారిపై బ్రిటిష్ వారిని తలదన్నే నిర్బంధాన్ని ప్రయోగిస్తూ , చేస్తున్న ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా  భగత్ సింగ్ తదితరుల విప్లవ వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
       పై కార్యక్రమంలో ఇఫ్టూ నాయకులు, పిచ్చా సూర్య కిరణ్, లంకాడ గణపతి,  సిర్రా వీర రాఘవులు, కొమ్మోజు శేఖర్, భాషా, గంగుల నాగరాజు, సుబ్బారావు, ఖండవల్లి గోపి, తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via