SGSTV NEWS
Andhra PradeshCrimeSpiritual

తిరుమలలో చిరుత సంచారం.. ఆలయంపై విమానం చక్కర్లు..వీడియో.. అధికారులేమంటున్నారంటే



తిరుమలలో చిరుత సంచారం, శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టిందంటూ వచ్చిన వార్తలు కలకలం రేపాయి. ఆదివారం మెట్ల మార్గంలో చిరుత కనిపించిందన్న వార్తలను అధికారులు ఖండించారు, శనివారం శిలాతోరణం వద్ద చిరుతను చూసినట్లు తెలిపారు. మరోవైపు, ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. పదే పదే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలలో తాజాగా వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనల గురించి తెలుసుకున్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇంతకు ఆ రెండు సంఘటనలు ఏంటంటే.. తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది అనేవార్త. మరోక న్యూస్ ఏంటంటే.. తిరుమల శ్రీవారి ఆలయపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఈ రెండు వార్తలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరి ఈ వార్తలు వాస్తవమేనా.. వీటిపై అధికారులు ఏమంటున్నారంటే.. ఆ వివరాలు..

తిరుమలలో మరో సారి చిరుత సంచారం కలకలం సృష్టించింది అంటూ వార్తలు వచ్చాయి. శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కనిపించిందంటూ ప్రచారంచేవారు. 500వ మెట్టు వద్ద చెట్ల పొదల్లో ఉన్న చిరుతను చూసి భక్తులు కేకలు వేశారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత దీని గురించి సెక్యూరిటీకి సమాచారం అందించగా.. సిబ్బంది అక్కడకు చేరుకొని సైరన్ మోతతో చిరుతను తరిమేశారంటూ వార్తలు వచ్చాయి.

అయితే అధికారులు మాత్రం ఇవి ఫేక్ వార్తలని తేల్చి చెప్పారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం ఉదయం చిరుత సంచరించిందంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని అటవీ శాఖ ఎఫ్ఆర్‌వో దొరైస్వామి తెలిపారు. ఈ మార్గంలో అసలు చిరుత రాలేదని దొరైస్వామి స్పష్టం చేశారు. అయితే శనివారం సాయంత్రం సుమారు 5.30 గంటలకు శిలాతోరణం వద్ద చిరుత కనిపించిందన్నారు దొరైస్వామి. ఆ తర్వాత అది అడివిలోకి వెళ్లి పోయినట్లు తెలిపారు. తిరుమలలో చిరుత సంచారం పూర్తిగా అవాస్తవం అని కొట్టి పారేశారు.



ఆలయంపై విమానం చక్కర్లు
ఇదిలా ఉంటే తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. నేడు అనగా ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో గుడి మీద నుంచి విమానం వెళ్లింది. ఆగమశాస్ర్త నిబంధనలకు విరుద్దంగా శ్రీవారి ఆలయం మీద నుంచి విమానాలు వెళ్తున్నాయి అని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరిన ఫలితం శూన్యం.

ఇక తాజాగా శ్రీవారి ఆలయం మీద విమానం చక్కర్లు కొట్టిన ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. పహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత భద్రతా అధికారులు తిరుమలలో హైఅలర్ట్‌ ప్రకటించారు. అంతేకాక తిరుమల కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉందని.. ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయలం మీదుగా విమానం చక్కర్లు కొట్టడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

Alao read

Related posts

Share this