కిరణ్‌రాయల్ తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తున్న లక్ష్మి మరో వీడియో విడుదల చేశారు. నేను జైపూర్ నుంచి తిరుపతికి క్షేమంగా వస్తానన్న నమ్మకం లేదు. నాకు నా పిల్లలకు ఏమైనా జరిగితే కిరణ్ రాయలే కారణం అంటూ ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేశారు
Laxmi vs Kiran Royal : కిరణ్‌రాయల్ తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తున్న లక్ష్మి మరో వీడియో విడుదల చేశారు. నేను జైపూర్ నుంచి తిరుపతికి క్షేమంగా వస్తానన్న నమ్మకం లేదు. నాకు నా పిల్లలకు ఏమైనా జరిగితే కిరణ్ రాయలే కారణం అంటూ ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నేను తిరుపతిలో కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేశా.. ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారంలో ఉన్నవాళ్లకే పోలీసులు అండగా ఉంటారా అని లక్ష్మి ప్రశ్నించారు. తనకు తిరుపతి పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు న్యాయం చేయలేదని ఆరోపించింది. జైపూర్ పోలీసులు తనపై నమోదైన కేసులో నా తప్పు లేదని తెలుసుకుని బెయిల్ ఇచ్చారని తెలిపింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తనకు న్యాయం చేయాలని కోరినా, ఆర్ధించినా నాకు న్యాయం జరగలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్నగా అండగా ఉంటాడనుకుని ఆయనకు అన్ని చెప్పుకున్నా లాభం లేదని వాపోయింది. తను తిరుపతికి వచ్చిన వెంటనే మరో వ్యక్తి విషయాలు కూడా చెప్తానని, ఆ వీడియోను కూడా రిలీజ్ చేస్తానని లక్ష్మి పేర్కొన్నారు. అయితే తను ఇక్కడి నుంచి క్షేమంగా తిరుపతి వస్తానని నమ్మకం లేదని, తనకు తన పిల్లలకు ప్రాణహాని ఉందని లక్ష్మి ఆందోళన వ్యక్తం చేసింది.తనకు తన పిల్లలకు ఏం జరిగినా కిరణ్ రాయల్ దే బాధ్యత అంటూ ఆమె తెలిపింది.
కాగా కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ గత కొద్దిరోజులుగా న్యాయపోరాటం చేస్తోన్న బాధితురాలు లక్ష్మిని రెండు రోజుల క్రితం జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆమెకు జైపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కాగా, తిరుపతి జనసేన పార్టీ ఇన్ చార్జి కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ మొదటిసారిగా లక్ష్మి విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ తనను బెదిరించి రూ.కోటికి పైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాడని ఆరోపించింది. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. కాగా లక్ష్మితో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా సంచలనంగా మారాయి. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు అన్యాయం గురించి వివరించారు. ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే జైపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇవాళ బెయిల్ వచ్చిన వెంటనే ఆమె మరో వీడియో విడుదల చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025