October 16, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Tirumala Laddu: తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు.. ల్యాబ్ రిపోర్ట్ విడుదల చేసిన టీడీపీ.. వీడియో

గత ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలు బయటకొచ్చాయి. నెయ్యిలో చేప నూనె, పామాయిల్‌, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్లు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ల్యాబ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.




ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం రేపుతోంది. లడ్డూ కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకపంనలు రేపాయి. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించింది. జులై 8, 2024న లడ్డూను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించగా.. NDDB CALF ల్యాబ్ జులై 17న నివేదిక ఇచ్చింది. అందులో అడ్డూలో వినియోగించిన పదార్థాలను వెల్లడించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో.. సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, జంతు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదిక ఇచ్చింది. కాగా  NDDB CALF ల్యాబ్ కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందింది. ఈ మేరకు ల్యాబ్ రిపోర్ట్‌ను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు అందజేశారు. తిరుమల వెంకన్న స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కచ్చితంగా సీరియస్ ఎంక్వయిరీ చేస్తామని ఆయన తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించేలా కుంభకోణానికి పాల్పడిన వారు సర్వ నాశనమైపోతారని మండిపడ్డారు. క్వాలిటీ నెయ్యి కేజీ కొనాలంటే రూ. 1000 పైగా ఖర్చవుతుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.320కి నెయ్యి టెండర్లు పిలిచిందన్నారు. నలుగురికి నెయ్యి టెండర్‌ కాంట్రాక్టు ఇచ్చారని, క్వాలిటీ నెయ్యి రూ.320కి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.

Also read

Related posts

Share via