November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్


వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

అమరావతి: వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తానూ ఇబ్బందులు పడ్డానని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ (PV Ramesh) తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో #LandTitling Act హ్యాష్ ట్యాగ్తో ఆయన పోస్ట్ చేశారు.

“నేను ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీవో పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండా తిరిగి ఇచ్చేశారు. చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలందించిన నా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం” అని పీవీ రమేశ్ పేర్కొన్నారు.

Also read

Related posts

Share via