కుటుంబంలో నెలకొన్న స్థలవివాదాల నేపథ్యంలో కొందరు తండ్రి వయసు వ్యక్తిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బాపట్ల జిల్లా నగరం మండలం దాసరిపాలెం శివారులో జరిగింది
రేపల్లె : కుటుంబంలో నెలకొన్న స్థలవివాదాల నేపథ్యంలో సొంత బాబాయ్పైనే కొందరు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బాపట్ల జిల్లా నగరం మండలం దాసరిపాలెం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూషయ్య(48), ఆయన ఇద్దరు సోదరుల కుమారులకు మధ్య ఇంటి స్థలం విషయంలో గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. వీటితోపాటు ఇరుకుటుంబాల మధ్య చిన్న మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి భూషయ్యకు, ఆయన సోదరుల కుమారులకు మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తులైన వారు కర్రలతో భూషయ్యపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు జీజీహెచ్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి
చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజాంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025