కపిలేశ్వరపురం : అంబేద్కర్ కోనసీమ జిల్లా కపీలేశ్వర పురం మండలం కేదార్లంక శివారు వీధి వారి లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి (38) అనే మహిళ అబూదబీలో ఇబ్బందులు పడుతున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు గతంలో కూడా గల్ఫ్ వెళ్లిన ఈమె మరోసారి తన కుటుంబ ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలో నాలుగు నెలల క్రితం పి.గన్నవరం కు చెందిన ఒక ఏజెంట్ ద్వారా అరబ్ షేక్ ఇంట్లో పనిచేసేందుకు అబూదబీ(దుబాయ్ )వెళ్ళింది. అక్కడ సరైన వసతులు లేకపోవడం ఇంటి సాకిరి మొత్తం తానే చేయాల్సి రావడంతో తనకు ఆరోగ్యం క్షీణించిందని, కనీసం తనను సరిగా తిండి పెట్టకుండా పనులు చేయించుకుంటున్నారని ఆమె తెలిపింది. తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు వీడియో ద్వారా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తనను స్వదేశమైన ఇండియాకు రప్పించాలంటూ వేడుకుంటుంది. కాగా బాధితురాలు జ్యోతికి వీధివారి లంకలో లైటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భర్త చంద్రశేఖర్, ఇంటర్మీడియట్ చదువుతున్న 18 సం.లు, 16 సం.లు, చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమె పుట్టిల్లు అంబాజీపేట మండలం మాచవరం కాగా ఆమె తల్లిదండ్రులు, జ్యోతి కోసం పిల్లలు, భర్త ఎదురుచూస్తున్నారు. తన తల్లిని వెంటనే తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..