ఖైరతాబాద్: మ్యారేజ్ బ్యూరో ముసుగులో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న వారిపై సెంట్రల్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు దాడిచేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్కు చెందిన అయేషా సిద్ధిఖీ షాదాన్ కాలేజ్ లేన్లో మ్యారేజ్ బ్యూరో పేరుతో కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది.
వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యాపారం నిర్వహిస్తోందని తెలుసుకున్న టాస్ ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేసి ప్రధాన నిర్వాహకురాలితో పాటు విటులు బానోత్ వీరుడు, షేక్ సిహబ్, మహ్మద్ సులేమాన్, మహ్మద్ నిజాముద్దీన్లను అదుపులోకి తీసుకొని వీరివద్ద నుంచి ఫోన్లు, నగదు, కండోమ్ ప్యాకెట్లు స్వా«దీనం చేసుకొని ఖైరతాబాద్ పోలీసుకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
- బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..?
- షైనింగ్ స్టార్ అవుతానని 3 రోజుల క్రితం సీఎంకు చెప్పిన బాలిక.. ఇప్పుడు విగతజీవిగా..!
- ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
- నిడదవోలు నియోజకవర్గం – పట్టణ వివిధ వార్డులో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం





