SGSTV NEWS online
Astrology

పుష్య నక్షత్రంలో గురు మార్పులు.. ఆగస్టు 19 వరకు ఈ రాశుల జాతకం అమాంతం మారబోతోంది



Jupiter Transit In Pushya Nakshatra: పుష్య నక్షత్రంలోని గురు గ్రహం నాలువ పాదంలోకి వెళ్లడం కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

Jupiter Transit In Pushya Nakshatra: జ్యోతిష్య శాస్త్రంలో అదృష్టం, సంపద, వివాహంతో పాటు జ్ఞానానికి కారకుడిగా భావించే దేవగురు బృహస్పతి నక్షత్ర సంచారంలో కీలక మార్పు చోటుచేసుకుంది. గురు గ్రహం పుష్య నక్షత్రంలోని నాలువ పాదంలోకి సంచారవ చేసింది. ఆగస్టు 3 సోమవారం రాత్రి 11 గంటలకు గురుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించగా.. ఆగస్టు 19 వరకు ఇదే స్థానంలో కొనసాగుతాడు. ఈ అద్భుతమైన నక్షత్ర పద సంచారం వల్ల ప్రధానంగా 4 రాశుల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం పెరగడమే కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగే అవకాశాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. అయితే ఏయే రాశులవారికి ఈ సమయం ఎంత బాగుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్ లాభాలు


కన్యా రాశి (Virgo)

గురు నక్షత్ర పద సంచారం కన్యా రాశి వారికి అపారమైన విజయాలను అందిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు అమాంతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కెరీర్‌లో బంపర్ పురోగతి సాధిస్తారు. గురు గ్రహ అనుగ్రహంతో అదృష్టం తోడై.. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. ఆదాయం పెరగడమే కాకుండా.. రాబోయే కొన్ని నెలల్లో వీరి ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి.

ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్‌లో పెద్ద ఎత్తున విజయం సాధించడమే.. కాకుండా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడతాయి. సంపాదనకు సరికొత్త మార్గాలు సుగమం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు వచ్చి.. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.. దీర్ఘకాలిక సమస్యలతో పాటు వివాదాల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

మకర రాశి (Capricorn)

మకర రాశి జాతకులకు గురుడి నక్షత్ర సంచారం అత్యంత శుభ సమయాన్ని అందిస్తుంది.. వ్యాపారంలో భారీ డీల్స్ కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సమాజంలో హోదా విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో ఇన్నాళ్లూ ఉన్న ఆందోళనలతో పాటు మానసిక అశాంతి తొలగిపోతాయి. ఆర్ధిక ఇబ్బందులు తీరిపోయి.. నూతన మార్గాల నుంచి లభించే ఆదాయంతో బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది.

మీన రాశి (Pisces)

మీన రాశి వారికి కూడా ఈ సంచారం అత్యంత సానుకూల ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సంపాదనకు కొత్త అవకాశాలు కూడా కలుగుతాయి.. ధన సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సామాజిక స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగార్థులకు నూతన ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, పెద్ద ఆఫర్లు లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి.

Also read

Related posts