SGSTV NEWS online
Astro TipsAstrologySpiritual

లక్ష్మీ నారాయణ యోగం.. వీరికి పట్టింది బంగారమే



జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కలయికకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే అతి త్వరలో ఎంతో శుభ ప్రదమైన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం పట్టింది బంగారమే కానుంది. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం సహజం. అయితే జూన్8న మృగశిర కార్తె ప్రారంభం కానుంది. అంతే కాకుండా ఈ సమయంలోనే శుక్రగ్రహం, బుధ గ్రహాలు రెండూ కూడా మిథున రాశిలో సంయోగం చెందనున్నాయి. దీంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పుడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కన్యా రాశి : కన్యా రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వలన పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఎవరు అయితే ఉద్యోగం చేస్తున్నారో, వారు ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేవారికి ఇది చాలా మంచి సమయం. అన్ని విధాలుగా ఈ రాశి వారికి కలిసిరానున్నది.

తుల రాశి : తుల రాశి వారికి ఈ లక్ష్మీనారాయణ యోగం ఓ అద్భుతం అని చెప్పాలి. వీరు ఏం చేయాలి అనుకున్నారో, అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి సమయానికి చేతికి అందుతుంది. కోర్టు వ్యవహారాలు మీకే అనుకూలంగా వస్తాయి. దీంతో చాలా ఆనందంగా గడుపుతారు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఇది అద్భతమైన సమయం. వీరికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అప్పుల బాధలు తొలిగిపోతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులతో పెద్ద కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది.

మిథున రాశి : మిథున రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వలన కలిసి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు మొత్తం పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఊహించని విధంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇవి మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. చాలా సంతోషంగా గడుపుతారు.

Related posts