SGSTV NEWS
CrimeTelangana

ప్రియుడితో భార్య పారిపోయిందని, ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన తండ్రి..!



అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం, నిందితుడు వినోద్, తన పిల్లలకు స్వీట్లు ఇంటికి తెచ్చాడు. పిల్లలు ఆత్రంగా స్వీట్లు తింటూ ఉండగా, బిల్ హుక్ తీసుకుని ముగ్గురు పిల్లల గొంతులు కోసి చంపాడు. ఆ తర్వాత అతను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ముగ్గురు పిల్లలను చంపినట్లు ఒప్పుకుని లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. భార్య మీద కోపంతో ఓ కసాయి ముగ్గురు బిడ్డలను అత్యంత పాశవికంగా హతమార్చాడు. తంజావూరులో ఒక తండ్రి తన ముగ్గురు పిల్లలను నరికి చంపాడని పోలీసులు తెలిపారు. తన భార్య మరొక వ్యక్తితో ఉన్న సంబంధంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు పిల్లల హత్య తంజావూరు ప్రాంతంలో సంచలనం సృష్టించింది. మదుక్కూరు పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

తంజావూరు జిల్లాలోని పట్టుక్కోట్టై తాలూకా గోపాలసముద్రం గ్రామానికి చెందిన నిందితుడు ఎస్ వినోద్ కుమార్ మదుక్కూర్ సమీపంలోని ఒక హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య నిత్య (35) దంపతులకు కుమార్తెలు వి ఓవియా (12), వి కీర్తి (8), కుమారుడు వి ఈశ్వరన్ (5) ఉన్నారు. ఓవియా ఆరో తరగతి విద్యార్థిని, కీర్తి మూడవ తరగతి చదువుతుండగా, బాలుడు కిండర్ గార్టెన్‌లో ఉన్నాడు.

నిత్య సోషల్ మీడియా ద్వారా మన్నార్గుడికి చెందిన ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. ఆరు నెలల క్రితం తన భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో.. ఆమె తన భర్త, పిల్లలను వదిలి ఆ వ్యక్తితో పారిపోయిందని, దీంతో వినోద్ కుమార్ షాక్ కు గురయ్యాడని పోలీసులు తెలిపారు. అయితే, అతను ఆమెను మర్చిపోలేకపోయాడు. కొన్ని రోజుల క్రితం ఆమెను కలిసి, తనతో తిరిగి రమ్మని కోరాడు. కానీ ఆమె నిరాకరించింది. దీంతో మద్యానికి బానిసైన వినోద్ ముగ్గురు పిల్లలను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం, నిందితుడు వినోద్, తన పిల్లలకు స్వీట్లు ఇంటికి తెచ్చాడు. పిల్లలు ఆత్రంగా స్వీట్లు తింటూ ఉండగా, బిల్ హుక్ తీసుకుని ముగ్గురు పిల్లల గొంతులు కోసి చంపాడు. ఆ తర్వాత అతను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ముగ్గురు పిల్లలను చంపినట్లు ఒప్పుకుని లొంగిపోయాడు. పోలీసులు షాక్ అయ్యారు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పట్టుక్కోట్టై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవిచంద్రన్ నిందితుడి క్షుణ్ణంగా విచారించారు. మరణించిన ముగ్గురు పిల్లల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం పట్టుక్కోట్టై ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు

Also read

Related posts