యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును కాచిగూడా రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన
హోంగార్డును కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఓ కుటుంబం తిరుపతి నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వస్తోంది. ఈ క్రమంలో హోంగార్డు ప్రతాప్.. ఎస్-3 కోచ్లో నిద్రిస్తున్న యువతి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తండ్రి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రైలు కాచిగూడ వచ్చిన తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కోడూరు పీఎస్లో హోంగార్డుగా పనిచేస్తున్న ప్రతాప్ యూనిఫామ్లో ఉండి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. నిందితుడి స్వస్థలం కడప జిల్లా రైల్వే కోడూరు అని పోలీసులు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025