తాడేపల్లి రూరల్ : అసలే అర్ధరాత్రి.. ఆపై మద్యం మత్తు..దీనికితోడు నేర చరిత్ర ఉన్న యువకులు.. మహిళ కనిపించగానే ఉన్మాదులుగా మారారు.. ఆమెపై దాడికి దిగారు.. గర్భంతో ఉన్నానని చెప్పినా వినకుండా పైశాచికంగా ప్రవర్తించారు..! తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పాత జాతీయ రహదారి వెంట పోలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలైన రైల్వే ఉద్యోగి ఆనందరావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీత ఉండవల్లిలో ఉంటూ విజయవాడలో విధులు నిర్వహిస్తున్నారు.
ఆదివారం విధులు ముగిశాక ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలకంపాడు మూడు బొమ్మల సెంటర్ దాటిన తర్వాత వెనుక నుంచి మద్యం మత్తులో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఢీకొట్టాడు. ఐదు నెలల గర్భిణి అయిన సునీతను ఆనందరావు పైకి లేపుతుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి దాడి చేశారు. ప్రతిఘటించే క్రమంలో సునీత చెప్పు తీసుకుని కొట్టింది. రెచ్చిపోయిన యువకులు ఫోన్ చేసి మరికొందరిని పిలిపించారు. ఆనందరావు, సునీతలను రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు. భార్యాభర్తలు రక్షించండి అని కేకలు వేయడంతో తాడేపల్లి పోలీసులు వస్తున్న సంగతి తెలిసి యువకులు పరారయ్యారు. వీరిపై రౌడీషీట్ ఉన్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..