పాత కక్షల కారణంగా నిండు ప్రాణం బలైంది. ఇంటి పక్కన ఉండే కుటుంబంపై కక్షతో ఒక వ్యక్తి పన్నని కుట్రకు, ఎలాంటి సంబంధం లేని మరో అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. మెదక్ జిల్లా నార్సింగిలో చోటు చేసుకున్న ఈ విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మెదక్, మార్చి14: పాత కక్షల కారణంగా నిండు ప్రాణం బలైంది. ఇంటి పక్కన ఉండే కుటుంబంపై కక్షతో ఒక వ్యక్తి పన్నని కుట్రకు, ఎలాంటి సంబంధం లేని మరో అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. మెదక్ జిల్లా నార్సింగిలో చోటు చేసుకున్న ఈ విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నార్సింగ్ కి చెందిన సుధాకర్ రెడ్డి, భూపాల్ రెడ్డిల మధ్య కొంత కాలంగా పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎలాగైనా హతమార్చాలని భూపాల్ రెడ్డి పథకం వేశాడు. అందులో భాగంగా, సుధాకర్ రెడ్డి ఇంటి పక్కనే ఉన్న బట్టలు ఆరేసే తీగకు రహస్యంగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. ఎవరైనా బట్టలు ఆరేసేందుకు వస్తే షాక్ తగిలి చనిపోతారని నిందితుడి దుర్మార్గపు ఆలోచన.
మేడ్చల్ జిల్లాకు(Medchal District) చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి, ఈ నెల 7వ తేదీన తన బంధువైన సుధాకర్ రెడ్డి ఇంటికి ఒక శుభకార్యం నిమిత్తం వచ్చాడు. మరుసటి రోజు ఈ నెల 8న ఉదయం స్నానం చేసిన అనంతరం, శ్యామ్ సుందర్ రెడ్డి బట్టలు ఆరేసేందుకు ఆ తీగ దగ్గరికి వెళ్లాడు. తీగను తాకగానే ఒక్కసారిగా భారీ విద్యుత్ షాక్‌కు(Electric shock) గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. శ్యామ్ సుందర్ రెడ్డి మృతిపై సుధాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, భూపాల్ రెడ్డి తన నేరాన్ని అంగీకరించాడు. సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో కరెంట్ తీగ అమర్చానని, కానీ ప్రమాదవశాత్తు శ్యామ్ సుందర్ రెడ్డి బలైపోయినట్లు ఒప్పుకున్నాడు. భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం





