తాడేపల్లి రూరల్ : అసలే అర్ధరాత్రి.. ఆపై మద్యం మత్తు..దీనికితోడు నేర చరిత్ర ఉన్న యువకులు.. మహిళ కనిపించగానే ఉన్మాదులుగా మారారు.. ఆమెపై దాడికి దిగారు.. గర్భంతో ఉన్నానని చెప్పినా వినకుండా పైశాచికంగా ప్రవర్తించారు..! తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పాత జాతీయ రహదారి వెంట పోలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలైన రైల్వే ఉద్యోగి ఆనందరావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీత ఉండవల్లిలో ఉంటూ విజయవాడలో విధులు నిర్వహిస్తున్నారు.
ఆదివారం విధులు ముగిశాక ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలకంపాడు మూడు బొమ్మల సెంటర్ దాటిన తర్వాత వెనుక నుంచి మద్యం మత్తులో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఢీకొట్టాడు. ఐదు నెలల గర్భిణి అయిన సునీతను ఆనందరావు పైకి లేపుతుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి దాడి చేశారు. ప్రతిఘటించే క్రమంలో సునీత చెప్పు తీసుకుని కొట్టింది. రెచ్చిపోయిన యువకులు ఫోన్ చేసి మరికొందరిని పిలిపించారు. ఆనందరావు, సునీతలను రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు. భార్యాభర్తలు రక్షించండి అని కేకలు వేయడంతో తాడేపల్లి పోలీసులు వస్తున్న సంగతి తెలిసి యువకులు పరారయ్యారు. వీరిపై రౌడీషీట్ ఉన్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.
Also read
- Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..
- Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
- చిన్నతనంలోనే ఇంత పంతం ఎందుకు.. విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి..
- Andhra News: తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారంటూ ఫేక్ వీడియోతో ప్రచారం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్!
- వీళ్లకు ఏమయ్యింది.. ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఆ తర్వాత ట్విస్ట్ ఇదే..