తల్లిని వలలో వేసుకుని మైనర్ బాలికకు కడుపు చేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో శనివారం అబార్షన్ కేసు విచారణలో దారుణాలు వెలుగు చూశాయి.
తల్లిని వలలో వేసుకుని మైనర్ బాలికకు కడుపు చేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో శనివారం మైనర్ బాలిక అబార్షన్ కేసు విచారణలో దారుణాలు వెలుగు చూశాయి. నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు విభేదాలతో కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. భార్య తన కూతురితో కలిసి భువనగిరి జిల్లా లోని ఘట్కేసర్ ప్రాంతంలో నివాసముంటోంది.
ఈడుకొచ్చిన కూతురిపై కూడా కన్ను వేసి
ఈ క్రమంలోనే ఆమెకు మరిది వరుసయ్యే రాము అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తల్లిని వలలో వేసుకున్న దుర్మార్గుడు ఈడుకొచ్చిన కూతురిపై కూడా కన్నేశాడు. తల్లి ప్రొద్బలంతో దుర్మార్గుడు పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చంది. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక సదరు బాలిక కొద్దిరోజుల క్రితం అమ్మమ్మకు తెలిపింది. ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా తొర్రూరులోని అమ్మ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్ నిర్వహించారు.
ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు
అయితే బాలికకు అబార్షన్ జరిగిన విషయం చైల్డ్ లైన్ కు పలువురి నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో తల్లి, ఆమె ప్రియుడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అబార్షన్ నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యంపై, బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన రాము, అందుకు సహకరించిన బాలిక తల్లిపై అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Also Read
- ఇదేం పనయ్యా.. ప్రభుత్వ ఉద్యోగంలో లక్షకుపైగా జీతం.. చేసేదేమో చైన్ స్నాచింగ్లు
- 5 నెలలుగా ఇంటికి తాళం.. అనుమానంతో తెరిచిన ఓనర్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే దృశ్యం!
- ఏపీ లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
- అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు
- చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం.. బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు.. బాలుడి చేయి ఛిద్రం!





