SGSTV NEWS online
CrimeTelangana

ప్రియురాలు పిలిచిందని వెళ్తే..



హైదరాబాద్: నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. ఫోన్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఓ యువకుడ్ని బైక్ మీద వచ్చిన కొందరు కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ s యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం రాత్రి సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే..

ఆల్వాల్లోని యాప్రాల్లో నివాసం ఉంటున్న యువన్.. నగర శివారులో ఓ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి చిలకలగూడకు వచ్చి స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన ఫోన్లో మ్యాచ్ చూస్తూ మునిగిపోయాడు. ఈలోపు బైకులపై వచ్చిన ఏడుగురు కత్తులతో యువన్పై దాడి చేశారు. ఈ పరిణామంతో ఆ యువకులు చెల్లాచెదురుకాగా.. తీవ్రగాయాలతో యువన్ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల, మెడ, చేతులు మొత్తం 15 కత్తిపోట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తొలుత భావించగా.. తర్వాత అదే నిర్ధారణ అయ్యింది.

యువన్ స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయంలో ఆమె సోదరుడితో యువను గొడవ కూడా అయ్యింది. కలుద్దామని యువతి గురువారం యువన్కు మెసేజ్ చేసింది. దీంతో యువన్ చిలకలగూడకు రాగా.. తట్టుకోలేకపోయిన యువతి సోదరుడు స్నేహితుల సాయంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుల అరెస్ట్ పై స్పష్టత రావాల్సి ఉంది.

Also read

Related posts