February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

HYD: పని మనుషులుగా చేరి.. 45 లక్షల నెక్లెస్‌తో పరార్


బీహార్ దొంగలు…వీరి రూటే సెపరేటు..కొత్తకొత్త మార్గాలు ఎన్నుకుని దొంగతనాలు చేయడంలో వీరి తర్వాతనే ఎవరైనా. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌‌లో ఒక జంట పనిమనుషులుగా చేరి 45 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను చోరీ చేసి పారిపోయారు. వివరాల్లోకి వెళితే…

రాజేంద్రనగర్ పరిధి బండ్లగూడలో ఈ దొంగతనం జరిగింది. అక్కడ ఉన్న మ్యాపిల్ టైన్ షిప్‌లో ఉంటున్న కొండల్ రెడ్డి ఇంట్లో బీహార్ నుంచి వచ్చిన దంపతులు పనిమనుషులుగా చేరారు. వీరిద్దరూ నెల రోజుల కిందట ఇక్కడ పని చేయడానికి జాయిన్ అయ్యారు. సరిగ్గా నెల తిరిగే సరికి దొరికిన కాడికి మొత్తం దోచేసుకుని పరారయ్యారు. డిసెంబర్ 23న   భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి రూ. 45 లక్షల డైమండ్, వెండి, గోల్డ్ నగలతో పాటు రూ. 55 లక్షల రూపాయలను కూడా ఎత్తుకెళ్లారు.

సీసీటీవీలో రికార్డ్..
పని మనుషులుగా చేరిన వాళ్ళే దొంగతనం చేశారని కొండల్‌రెడ్డి చెబుతున్నారు. డిసెంబర్ 24న ఉదయం లేచేసరికి ఇంట్లో పనివారు కనిపించలేదు. వెతికి చూస్తే అసలు విషయం బయటపడింది అని చెబుతున్నారు. సీసీ ఫుటేజ్‌లో దొంగతనానికి సంబంధించి మొత్తం దృశ్యాలు రికార్డ్ అయ్యాయని కొండ్ రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దొంగలు కోసం దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఉన్న సంగతి పనిమనుషులుగా చేరిన ఇద్దరికీ తెలుసు. నెలరోజులుగా అన్నీ అబ్జర్వ చేసిన తరువాతనే వారు ఈ దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఈపాటికే వారిద్దరూ హైదరాబాద్ నుంచి పరార్ అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందు ఇద్దరు దొంగలూ ఎలా ప్రయాణిస్తున్నారో తెలుసుకుంటే…వారిని పట్టుకోవడం ఈజీ అవుతుందని చెబుతున్నారు.

Also Read

Related posts

Share via