తమిళనాడులో కార్పోరేటర్ గోమతిని తన భర్త నడి రోడ్డుపై నరికి దారుణంగా చంపాడు. గోమతికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో చంపేసి, వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాడు.
తమిళనాడులో వివాహేతర సంబంధం వల్ల ఓ భర్త భార్యను హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరునింద్రవూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎస్ గోమతి కౌన్సిలర్‌గా పని చేస్తుంది. పదేళ్ల కిందట ఈ జంటకు పెళ్లి కాగా వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే గోమతికి వేరే వ్యక్తితో రిలేషన్ ఉందని అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు తరచుగా గొడవలు జరిగేవి.
అనుమానంతోనే..
గోమతి తాజాగా ఓ అబ్బాయిని కలిసినట్లు భర్తకు తెలిసింది. దీంతో గోమతి భార్య స్టీఫెన్ రాజ్ ఆమెతో గొడవపడ్డాడు. ఈ వివాదం కాస్త ముదరడంతో భర్త స్టీఫెన్ ఆమెను నడి రోడ్డుపై కత్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై తిరువళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోమతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also read
- నేటి జాతకములు..16 జూలై, 2025
- Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..
- Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
- చిన్నతనంలోనే ఇంత పంతం ఎందుకు.. విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి..
- Andhra News: తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారంటూ ఫేక్ వీడియోతో ప్రచారం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్!