హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. ఆ మహిళ హత్యకు పాత కక్షలే కారణమా..! మరేదైనా మర్మం దాగి ఉందా..! కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ హత్య భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామంలో జరిగింది. సుమలత అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. గురువారం(జూన్ 05) రాత్రి ఆమెపై దాడిచేసిన గుర్తు తిరగని దుండగులు గొడ్డలితో నరికి హతమార్చారు. బయటికి వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి సుమలత రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..
అయితే పాతకక్షలే ఈ హత్యకు కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన గుల్ల రాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. రాజుపై భీమదేవరపల్లి పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. అతనిపై రౌడీషీట్ కూడా ఉంది. రాజు పై ఉన్న రెండు కేసులో సుమలత ప్రధాన సాక్షిగా ఉంది. మే 11వ తేదీన ఒక కేసు విచారణ ఉన్న నేపథ్యంలో తన అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, గత కొన్ని రోజుల నుండి సుమలత పైన రాజు ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. కానీ సుమలత అందుకు నిరాకరించడంతో పథకం ప్రకారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను హతమార్చాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం రాజు పరారీలో ఉండగా.. ఈ హత్య వెనుక అన్ని అనుమానాలు అతని వైపే వేలు చూపిస్తుండడంతో అతడే హత్య చేసి పారిపోయి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు