అయోధ్య రామమందిరం ప్రసాదం హోమ్ డెలివరీ చేస్తామని ఓ వ్యక్తి భక్తుల నుంచి ఆన్లైన్లో వసూళ్లు చేశాడు. 6.3 లక్షలకు పైగా భక్తుల నుంచి రూ.3.85 కోట్లు తీసుకున్నారు. రామ మందిరం ప్రారంభానికి కొన్ని వారాల ముందు ఈ స్కామ్ జరగగా.. సైబర్ పోలీసులు ఇటీవల బయటపెట్టారు.
భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు ఓ వ్యక్తి. మీ ఇంటి ముందుకే అయోధ్య రామమందిరం ప్రసాదం డెలివరీ చేస్తామని ఆన్లైన్లో డబ్బులు వసూలు చేశాడు. రామలల్లా ప్రసాదం పంపిణీ కోసం ఓ వెబ్సైట్లో డబ్బులు చెల్లించామని కొందరు భక్తులు పోలీసులు ఆశ్రయించారు. సైబర్ పోలీసులు వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా విస్తుపోయే షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి.
అయోధ్య రామాలయంలోనే అతిపెద్ద సైబర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దేవుడి పేరు చెప్పి ఆన్లైన్లో వసూళ్లకు పాల్పడ్డారు. భక్తుల నుండి సుమారు రూ.3.85 కోట్లు స్వాహా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 2024 జనవరిలో రామలల్లా ఆలయం ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా అయోధ్య రామమందిరానికి భక్తుల తాకిడి బాగా పెరిగింది. ఇదే అదునుగా చూసుకొని అమెరికా సియాటిల్‌లోని యూనివర్సిటీలో ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ ఓ వ్యక్తి ప్రసాదాన్ని మీ ఇంటి వద్దకే పంపిస్తానని సర్వీస్ స్టార్ట్ చేశాడు. అమెరికాలోని లక్షలాది మంది భక్తులను ఆన్లైన్లో డబ్బులు చెల్లించారు. నిజానికి అతను యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు.. ఘజియాబాద్‌కి చెందిన ఆశిష్ సింగ్ అమెరికాలో నివసిస్తున్నాడు. అయోధ్య రామమందిరంలో విగ్రహా ప్రతిష్టాపనకు కొన్ని వారాల ముందు khadiorganic.com అనే ఓ ఫేక్ పోర్టల్ ప్రారంభించాడు. 2023 డిసెంబర్ 19న నుంచి 2024 జనవరి 12 వరకు 6.3 లక్షలకు పైగా భక్తుల ప్రసాదాన్ని ఆ పోర్టల్‌లో ఆర్డర్ చేసుకున్నారు. వారి దగ్గరి నుంచి రూ.3.85 కోట్లు తీసుకున్నాడు.
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..