అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో భారీ గిరినాగు హల్‌చల్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ 12 అడుగుల భారీ గిరినాగు రైతు పొలంలో తిష్ట వేసింది.
అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో భారీ గిరినాగు హల్‌చల్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ 12 అడుగుల భారీ గిరినాగు రైతు పొలంలో తిష్ట వేసింది. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసింది. ఇదంతా చూసిన అక్కడి వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానిక ప్రజలు సైతం భయంతో వణికిపోయారు.
వెంటనే గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వాళ్లు స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు. గంట పాటు శ్రమించిన స్నేక్ స్నాచర్స్ గిరినాగును బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంత పెద్ద గిరినాగు ఈ ప్రాంతంలో ఎప్పుడు చూడలేదని స్థానికులు అంటున్నారు
Also read
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!
- మద్యం మత్తు.. స్నేహితుల మధ్య చిచ్చు.. యువకుడిపై యాసిడ్ దాడి, పరిస్థితి విషమం!





