వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార నేతల పేరుతో పల్నాడు జిల్లా మాచవరం హెడ్కానిస్టేబుల్ డబ్బు వసూళ్లకు పాల్పడ్డారని పిన్నెల్లి వాసి, తెదేపా సానుభూతి పరుడు షేక్ సత్తార్ ఆరోపించారు.
మాచవరం: వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార నేతల పేరుతో పల్నాడు జిల్లా మాచవరం హెడ్కానిస్టేబుల్ డబ్బు వసూళ్లకు పాల్పడ్డారని పిన్నెల్లి వాసి, తెదేపా సానుభూతి పరుడు షేక్ సత్తార్ ఆరోపించారు. గ్రామంలో ఉండాలంటే రూ. లక్ష కట్టాలని హెడ్ కానిస్టేబుల్ నాగేండ్ల అశోక్ బాబు బెదిరించాడని, భయంతో ఆయనకు డబ్బు ఇచ్చానని షేక్ సత్తార్ తెలిపారు. గత ప్రభుత్వంలో వైకాపా నేతలకు అనుకూలంగా ఉంటూ అశోక్బాబు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇటీవల మాచవరం నుంచి వెల్దుర్తికి బదిలీ అయిన హెడ్ కానిస్టేబుల్ అశోక్బాబు నుంచి డబ్బు ఇప్పించాలని పోలీసు అధికారుల్ని కలిసి విన్నవించినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే మార్గమని వాపోయాడు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025