BRS : రాజకీయ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. అలా కాదని.. కామంతో రెచ్చిపోతే.. కెరీర్ ఫసక్. ఏమాత్రం కక్కుర్తిపడినా పరువంతా రోడ్డున పడుతుంది. ఇమేజ్ అంతా డ్యామేజ్ అవుతుంది. జనాలు ఛీ కొడతారు. లేటెస్ట్గా ఓ బీఆర్ఎస్ నాయకుడు ఓయో రూమ్ లో.. ఓ యువతితో అడ్డంగా దొరికిపోయిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది
ఓయో రూమ్ లో..
అతని పేరు గోగుల రాజు. మహబూబాబాద్ అర్బన్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అతని భార్య 28వ వార్డు మాజీ కౌన్సిలర్. రాజుకు మరొక యువతితో అక్రమ సంబంధం ఉంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య యవ్వారం నడుస్తోంది. దురద ఎక్కువై.. ఓయో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆ యువతితో ఎంజాయ్ చేస్తుండగా.. సడెన్ గా అతని భార్య ఎంట్రీ ఇచ్చింది. అంతే, సీన్ మొత్తం మారిపోయింది.
భర్తను చితక్కొట్టిన భార్య..
గోగుల రాజును, ఆ యువతిని OYO రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య అనురాధ. తాను ఉండగా చాటుగా మరో మహిళతో గడుపుతావా? అంటూ భర్తను చితక్కొట్టింది. ఆమెతో పాటు వచ్చిన వాళ్లంతా కలిసి.. ఆ ఇద్దరినీ దంచుడు దంచారు. మొదట కాస్త దబాయించాలని చూశాడు. కానీ, అతన్ని వదలలేదు. మరింత రెచ్చిపోయారు. పోలీసులకు కాల్ చేశారు. ఖాకీలు వస్తే మరింత అడ్డంగా బుక్కెపోతామని భయపడిన గోగుల రాజు.. అక్కడి నుంచి చాకచక్యంగా పారిపోయాడు. పోలీసులు వచ్చే సరికి అతను అక్కడ లేడు. మాజీ కౌన్సిలర్ అనురాధ ఫిర్యాదు మేరకు.. గోగుల రాజు కోసం గాలిస్తున్నారు.
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు
Kiran Royal Issue: జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్.. లక్ష్మి అరెస్ట్