వేలూరు: ప్రియుడి కోసం చెన్నై నుంచి గుడియాత్తం వచ్చిన ఓ యువతిని దారుణంగా హత్య చేశారు. వి వరాల్లోకి వెళితే.. చెన్నై పులియంతోపు సమీపంలోని కస్తూరి బాయ్‌కాలనీకి చెందిన వేలుస్వామికి ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె దీప (33)కు గత 2014వ సంవత్సరంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన రెండేళ్లకే భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం తల్లిదండ్రులతో నివసిస్తోంది. 2022 వ సంవత్సరంలో దీప చెన్నైలోని సెల్‌ఫోన్ దుకాణంలో పనిచేసే సమయంలో వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని ఆలత్తూరు గ్రామానికి చెందిన హేమంత్‌రాజ్(26)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరూ సెల్‌ఫోన్‌లో తరచూ మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రే మించుకున్నారు. దీంతో దీప తనను వివాహం చేసుకోవాలని హేమంత్‌రాజ్‌ను తరచూ కోరుతోంది.
దీప తనకంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దది కావడంతో అతడు వివాహానికి నిరాకరించాడు. అయినప్పటికీ ఇద్దరూ ప్రేమించుకుంటూనే ఉ న్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన దీపను గుడియాత్తం రావాలని హేమంత్‌రాజ్ కోరాడు. ప్రియుడి మాటలు నమ్మిన దీప చెన్నై నుంచి రైలులో గుడియాత్తం పట్టణానికి వచ్చింది. రైల్వేస్టేషన్‌లో వేచి ఉన్న హేమంత్‌రాజ్ బైకులో గుడియాత్తం సమీపంలోని ఒక కొండ ప్రాంతానికి దీప ను తీసుకెళ్లాడు. అక్కడ దీపకు మాయ మాటలు చెప్పి, ఇద్దరూ ఉల్లాసంగా గడిపారు. ఆ సమయంలో దీప తనను వివాహం చేసుకోవాలని కోరింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆగ్రహించిన హేమంత్‌రాజ్ తన వద్ద దాచుకున్న కత్తితో దీప గొంతు కోసి, కొండపై నుంచి మృతదేహాన్ని కింద తోసివేసి కత్తిని కూడా అక్కడే వదలి, ఏమీ తెలియనట్టూ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇదిలా ఉండగా దీప కనిపించలేదని తల్లిదండ్రులు చెన్నై పులియంతోపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీప సెల్‌ఫోన్ నంబర్‌ను పరిశీలించి, విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు హేమంత్‌రాజ్‌ను చెన్నైకి తీసుకెళ్లి విచారణ జరపగా దీపను కొండకు తీసుకెళ్లి హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు కొండ ప్రాంతానికి వెళ్లి కుళ్లిపోయిన మృత దేహాన్ని పోస్టుమారా్టనికి తరలించి, విచారణ జరపుతున్నారు
Also read
- నేటి జాతకములు.29 ఏప్రిల్, 2026
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.





