April 15, 2025
SGSTV NEWS
Telangana

*డ్రగ్స్ నిర్ములన పై విద్యార్థులకు అవగాహన కల్పించిన

*కామారెడ్డి జిల్లా టి.ఎస్.నాబ్ అధికారి డి.ఎస్పీ సోమనాదం*


కామారెడ్డి జిల్లా బ్యూరో ఆగస్టు 17 : శనివారం రోజు దేవునిపల్లి పిఎస్ పరిధిలోని కామారెడ్డి డిగ్రీ కాలేజ్ నందు టీఎస్ నాబ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా తెలంగాణని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా,డ్రగ్స్ నిర్మూలించాలని ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా టిఎస్ నాబ్ అధికారి డిఎస్పి సోమనాదం డిగ్రీ కళాశాలవిద్యార్థులకు డ్రగ్స్ తీసుకుంటే కలిగే దుష్పరిణామాలు మరియు దాని పర్యవసానాలు తెలియజేస్తూ,ఎవరైనా డ్రగ్ సరఫరా గాని అదేవిధంగా తీసుకున్నట్లయితే వాటికి సంబంధించిన వివరాలను తెలియజేయాలని.ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది.అదే విధంగా విద్యార్థులు తమ భవిష్యత్తును మంచిగా నిర్మించుకోవాలని,ఎలాంటి చెడు ప్రవర్తనలకి,దురావాట్లకు లోను కాకూడదని సందేశం ఇచ్చినారు.డ్రగ్స్ నిర్మూలనకు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్,దేవునిపల్లి ఎస్ఐ రాజ,డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.డ్రగ్స్ సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నట్లయితే 100 నంబర్కు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 14446 కి తెలుపగలరు.మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది.

Also read

Related posts

Share via