కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం, మద్యం మత్తులో ఉన్న భర్త శ్యామలపై కత్తితో దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
భార్యపై అనుమానంతో మద్యం మత్తులో కత్తి తో దాడి చేశాడు ఓ కిరాతక భర్త. తీవ్ర గాయాలతో ఉన్న భార్య శ్యామలను హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి – శేఖరయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు. శేఖరయ్య ముప్పై సంవత్సరాల క్రితం చనిపోగా పెద్ద కూతురు అరుణను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన వృత్తిరీత్యా టైలర్‌గా పనిచేస్తున్న సతీష్‌కు ఇచ్చి వివాహం చేసింది లక్మి.
ఆ తర్వాత వారికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఈ క్రమంలో భార్య అరుణ చిన్న చెల్లెలు శ్యామలను తనకు ఇచ్చి వివాహం చేయాలని సతీష్ వేధించాడు. భర్త మృతి చెందడం నలుగురు కూతుళ్ల భారం.. మరో వైపు అల్లుడు వేధింపులు భరించలేని లక్మీ.. చిన్న కూతురు శ్యామలను సతీష్‌కు ఇచ్చి వివాహం చేసింది. అనంతరం పెద్ద భార్య అరుణను ఇంటి నుండి వెళ్లగొట్టడంతో ఇద్దరు కూతుళ్ళతో తల్లి ఇంటి వద్దే ఉంటుంది అరుణ. ఇక, శ్యామలకు ఇద్దరు కూతుళ్లు పుట్టిన అనంతరం నిత్యం మద్యం సేవించి వేధించడం మొదలు పెట్టాడు సతీష్. అంతేగాక, శ్యామల కూలి పని చేసి సంపాదించిన డబ్బులు ఇవ్వమని వేధించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అయితే నేడు తెల్లవారుజామున భార్య శ్యామలతో గొడవపడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు
Also read
- యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. కారులో వచ్చి కత్తులతో దారుణంగా..
- బాలికపై లైంగిక దాడి.. ‘క్షమాపణ చెబితే చాలు’ అని తీర్పు!
- అనంతపురంలో కారు బీభత్సం
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.





