అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన 71 సంవత్సరాల విశ్రాంత ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.4 కోట్లు కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
నర్సీపట్నం అర్బన్ : అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన 71 సంవత్సరాల విశ్రాంత ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.4 కోట్లు కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణ సీఐ జి.గోవిందరావు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘మీ ఎకౌంట్ కు సంబంధించి భారీ కుంభకోణం జరగడంతో డిజిటల్ అరెస్టు అయ్యారు’ అని సైబర్ నేరగాళ్లు తొలుత వృద్ధుణ్ని ఫోన్ లొ తీవ్రంగా బెదిరించారు. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే సొమ్ము చెల్లించాలనడంతో బాధితుడు బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లుగా దాచుకున్న నగదును విత్ట్ చేసి మరీ వారికి పంపించారు. మూడు రోజుల వ్యవధిలో ఆ మొత్తాన్ని నిందితులు చెప్పిన ఖాతాలకు జమ చేసేశారు. తరువాత తాను మోసపోయినట్టు గుర్తించి 12 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి విజ్ఞప్తి మేరకు ఆయన పేరు, ఇతర వివరాలు వెల్లడించడం లేదని సీఐ తెలిపారు. వెంటనే అప్రమత్తమై బాధితుడు పంపిన కొంత నగదు విత్ డ్రా కాకుండా చూశామని, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను పంపించామని తెలిపారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులంటూ భయపెట్టినా, ఇతరత్రా బెదిరించినా వెంటనే 1930 నంబరును సంప్రదించాలన్నారు.
Also read
- రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం
- ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు! అంతుచిక్కని మిస్టరీ..
- బీచ్లో కొట్లాట.. కట్ చేస్తే.. బయటపడ్డ ఎప్పుడో జరిగిన హత్య కేసు మిస్టరీ..!
- ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
- బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నిండా ముంచేశారు!





