ఐ.యఫ్.టి.యు జాతీయ కమిటీ పిలుపు మేరకు నిడదవోలు యర్నగూడెం రోడ్ లో ఇఫ్టు స్థూపం వద్ద నిర్వహించిన డిమాండ్స్ డే కార్యక్రమం.
ఈ సందర్భంగా ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ , జిల్లా కమిటీ సభ్యులు గెడ్డం రవీంద్ర బాబు లు మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మికులు అనుభవిస్తున్న 8 గంటల పని తో సహా వివిధ రకాల చట్టాలను మోడి ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్ ల అమలు ద్వారా పెట్టుబడి దారులకు మేలు చేకూర్చింద నీ తక్షణమే లేబర్ కోడ్ లు రద్దు చేసి కనీస వేతనాలు, బోనస్, ఈ.యస్.ఐ, సమాన పనికి సమాన వేతనం, శాస్వత స్వభావం కలిగిన వృత్తి లో పర్మినెంట్ ఉద్రోగ వ్యవస్థ అమలు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఆశ- అంగన్వాడీ తదితర స్కీం వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని కోరుతూ డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించారు.
పై కార్యక్రమంలో ఇఫ్టు యూనియన్ నాయకులు పిచ్చా సూర్య కిరణ్ లంకాడ గణపతి , బాపినీడు,గాలి గని రాజు, రమణ, యాగాటి సత్యనారాయణ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు
Also read
- భార్య బడిత పూజకు భర్త బలి
- అమీర్ పెట్ ప్రమాదం.. స్పాట్ కు ‘హైడ్రా’ రంగనాథ్
- ప్రేమలో గొడవ.. ప్రేయసిపై ఘాతుకం
- లవర్స్ కోసం.. కుళాయిలు కొట్టేశారు
- ఇంట్లో పామును చంపారా? శాస్త్రం చెప్పిన నిజం తెలిస్తే వణకాల్సిందే!





