November 21, 2024
SGSTV NEWS
Crime

ఆన్ లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ



ఆన్లైన్ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గంగాధర,  ఆన్లైన్ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా గంగాధరలోని మధురానగర్కు చెందిన నాగుల లక్ష్మణ్, లక్ష్మిల కుమారుడు పృథ్వీ(25) బీటెక్ పూర్తి చేసి ఏడాది క్రితం హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేరు ఇంజినీరుగా చేరారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు వెళ్లాలని కంపెనీ సూచించడంతో రెండు నెలల కిందట అక్కడకు వెళ్లారు. స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉండేవాడు. ఈ క్రమంలో ఆన్లైన్లో పరిచయమైన ముగ్గురు వ్యక్తులు అతన్ని ఆన్లైన్ జూదంలోకి దింపారు. ఇందు కోసం పృథ్వీ వివిధ కారణాలు చెప్పి స్నేహితుల వద్ద రూ.12 లక్షలు అప్పు చేశారు. కానీ నాలుగు రోజుల్లోనే మొత్తం పోగొట్టుకున్నారు. దీంతో 15 రోజులుగా ఉద్యోగానికి వెళ్లకుండా గదిలోనే ఉండేవారు. అప్పులు ఎలా చెల్లించాలో తెలియక ఆందోళనకు గురై శనివారం రాత్రి గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నారు. ఈ మేరకు నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వగ్రామాని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also read

Related posts

Share via