హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చిన అమెరికాకు చెందిన ఓ వ్యక్తి హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హోటల్ సిబ్బంది సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఓ అమెరికా పౌరుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తి హోటల్ గదిలోనే విగతజీవిగా కనిపించాడు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినస్‌లో ఉన్న మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ అనే (41) వ్యక్తి ఇటీవలే వ్యాపార పనుల నిమిత్త హైదరాబాద్ వచ్చారు.. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినస్‌లో ఉన్న మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటూ తన పనులు చూసుకున్నాడు. అయితే హోటల్ సిబ్బంది ఎన్ని సార్లు కాల్ చేసినా బ్రియాన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి.. అతని గదికి వెళ్లి చూడగా అతను మంచంపై విగతజీవిగా కనిపించాడు.
అది చూసి షాకైన సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి రద్యాప్తు చేపట్టారు.
అయితే అమెరికా పౌరుడి మృతి వెనుక గల కారణాలు ప్రస్తుతం తెలియరాలేదు. అనారోగ్యంతో చనిపోయాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు
Also read
- Hyderabad: గచ్చిబౌలి హోటల్లో అమెరికా వాసి అనుమానాస్పద మృతి
- Hyderabad: పిన్ని ఇంట్లో కన్నం వేయమని ఫ్రెండే చెప్పింది.. ఈ కథ సినిమాకు ఏం తక్కువ కాదు..
- కొత్తగూడెంలో దారుణం.. భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్
- Telangana: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. పోలీసులకు ఎలా దొరికారంటే..!
- మోస్ట్ వాంటెడ్ మహిళా గంజాయి డాన్ అరెస్ట్! 30 కేసులు, 13 కేసుల్లో పరారీ.. ఆస్తుల చిట్టా పెద్దద్దే!





