గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్‌లో ఓ కుమారుడు తన తండ్రిని హత్య చేశాడు. మృతుడు హన్మంత్ నాయక్ (38)గా పోలీసులు గుర్తించారు. కుమారుడు రవీందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
TG Crime: కన్నతండ్రిని కొడుకు కడతేర్చిన దారుణమైన ఘటన గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్లో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్న తీరును ఈ అమానవీయ ఘటన కళ్లకు కడుతోంది. కన్న కొడుకే తండ్రి మెడకు యమపాశం కావడం మానవ సమాజాన్నే తలదించుకునేలా చేసింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు హన్మంత్ నాయక్ (38) తన కుటుంబంతో కలిసి గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. కుటుంబంలో గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హన్మంత్ నాయక్‌కు అతని కుమారుడు రవీందర్‌తో (19) తరచూ గొడవలు జరిగేవి. ఏదో విషయమై రవీందర్ తన తండ్రి పట్ల అసహనంతో ఉండేవాడని పలువురు చెబుతున్నారు. అయితే కుటుంబ కలహాల విషయమై ఎటువంటి స్పష్టత లేదని అంటున్నారు.
కన్న తండ్రిని చంపి కొడుకు..
ఈ క్రమంలో ఎన్టీఆర్ నగర్‌లో ఎవరు లేని ఓ చోటుకు హన్మంత్ నాయక్‌ను అతని కొడుకు రవీందర్ తీసుకెళ్లారు. అక్కడే వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రవీందర్ దాడి చేసిన దాడిలో హన్మంత్ నాయక్ మరణించి ఉంటాడనే సందేహాలు కలుగుతున్నాయి. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తండ్రిని సమీపంలోని ఓ చెట్టు వద్ద పడేసి అక్కడి నుంచి రవీందర్ పరారయ్యాడని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు.
స్థానికులు తెలిపిన వివరాలను నమోదు చేసుకున్నారు. అదే విధంగా సీసీ టీవీలో నమోదైన వివరాల ప్రకారం నిందితుడిని రవీందర్‌గా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు టీంలు హన్మంత్ నాయక్ కుమారుడైన రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా నేరం తానే చేసినట్లు అంగీకరించాడని సమాచారం. హత్యోదంతంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే హత్యకు కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కుటుంబ కలహాల కారణంగానే తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగి ఉంటుందని, ఆ క్రమంలోనే భౌతిక దాడి కారణంగా మరణించి ఉంటాడనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి
Also read
- నేటి జాతకములు..16 జూలై, 2025
- Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..
- Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
- చిన్నతనంలోనే ఇంత పంతం ఎందుకు.. విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి..
- Andhra News: తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారంటూ ఫేక్ వీడియోతో ప్రచారం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్!