సేలం, : నీట్ పునఃపరీక్ష భయంతో తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా వెల్లాపురానికి చెందిన గోపిక గతంలో నీట్ లో అర్హత సాధించలేకపోవడంతో ఈ ఏడాది మళ్లీ రాసింది. ప్రశ్నపత్రాల లీక్ నేపథ్యంలో నీట్ రద్దు కావడంతో ఈ నెల 21న జరగనున్న పునఃపరీక్షకు సిద్ధమవుతోంది. సరిగా రాయలేనని భయాందోళనకు లోనైన ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కొంగణాపురం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల కిందటే 20వ పుట్టినరోజు జరుపుకొన్న గోపిక ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





