ఆలుమగల గొడవకు మూడు ప్రాణాలు బలి
కాశీబుగ్గ, పలాస, కోటబొమ్మాళి, : శ్రీకాకుళం జిల్లా పలాస రైలు నిలయం సమీపంలో ఘోరం జరిగింది. ఇద్దరు కన్నబిడ్డలతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రైల్వే పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు… కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటకు చెందిన గేదెల వెంకటరావుతో సంతబొమ్మాళి మండలం కొత్తపేటకు చెందిన పూజ(28)కు 2019లో వివాహమైంది. వీరికి కుమారుడు కుశాంత్(7), కుమార్తె దీక్షిత(6) ఉన్నారు. ఉపాధిరీత్యా వెంకటరావు భార్యాపిల్లలతో కలిసి విజయవాడలో నివాసముంటున్నారు. ఇటీవల ఆయన సోదరి భర్త మృతి చెందడంతో పరామర్శకు స్వగ్రామానికి వచ్చారు.
వెంకటరావు తల్లి పాపమ్మ వృద్ధురాలు కావడంతో మంచానికే పరిమితమయ్యారు. ఆమెకు సపర్యలు చేసే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలతో కలిసి పూజ గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. సాయంత్రం నుంచి పలాస రైలు నిలయం పరిసరాల్లో తిరుగుతూ అర్ధరాత్రి దాటాక పిల్లలతో కలిసి సోంపేటవైపు వెళ్లే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం జీఆర్పీ పోలీసులు పట్టాలపై మృతదేహాలను గుర్తించి పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేశామని జీఆర్పీ ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.
Also read
- Garuda Purana: దేవుని గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? గరుడ పురాణం చెప్పిన నియమాలు ఇవే!
- Achamanam: పూజకు ముందు ఆచమనం ఎందుకు చేస్తారు? శాస్త్రాలు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే
- నేటి జాతకములు 5 ఆగస్టు, 2026
- ‘నన్ను పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకం’.. దొంగ బాబా లీలలు! కట్ చేస్తే చితకబాదిన జనాలు
- కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా





