విజయనగరం, జామి: మా అల్లుడు ముమ్మాటికీ సైకో అని.. అలా ప్రవర్తించే తమ కుమార్తెను బలి తీసుకున్నాడని రాధా గాయత్రి తల్లిదండ్రులు వాపోయారు. కొద్ది రోజుల క్రితం దేహ్రాదూన్‌లో గాయత్రి అనుమానాస్పదంగా మృతిచెందిన విషయంపై ‘ఈనాడు’తో శుక్రవారం మాట్లాడారు. బిట్స్ పిలానీలో చదివిన విద్యావంతుడని, మంచి భవిత ఉంటుందని భావించి శ్రీచరణ్ గాయత్రి వివాహానికి అంగీకరించామని ఆమె తల్లి సత్యవతి పేర్కొన్నారు. మంచి కుటుంబం, ఉన్నత విద్య కారణంగా తమ కుమార్తె జీవితం సంతోషంగా సాగుతుందని ఆకాంక్షించామన్నారు. పెళ్లైన మూడు నెలలకే గాయత్రిపై మానసిక వేధింపులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు.
తల్లిగా తనతో కొన్ని విషయాలు చెప్పినా అన్నీ సర్దుకుంటాయని నచ్చజెప్పేందుకు యత్నించానన్నారు. హైదరాబాద్‌లో ఒంటరిగా ఉన్న గాయత్రికి తరచూ వీడియో కాల్స్ చేసేవాడని, అనుమానంతో మానసికంగా తీవ్రంగా వేధించేవాడని చెప్పారు. శ్రీచరణ్ ప్రవర్తన సైకో తరహాలో ఉండేదని, ఉద్యోగాల్లో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదని ఇప్పుడు తెలిసిందన్నారు. నిరంతర వేధింపులు, మానసిక ఒత్తిడి కారణంగా తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే విశాఖ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. నిందితుడికి కఠిన శిక్షపడే వరకు పోరాటం సాగిస్తామన్నారు.
Also read
- Garuda Purana: దేవుని గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? గరుడ పురాణం చెప్పిన నియమాలు ఇవే!
- Achamanam: పూజకు ముందు ఆచమనం ఎందుకు చేస్తారు? శాస్త్రాలు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే
- నేటి జాతకములు 5 ఆగస్టు, 2026
- ‘నన్ను పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకం’.. దొంగ బాబా లీలలు! కట్ చేస్తే చితకబాదిన జనాలు
- కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్‌లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా





