పేషేంట్ ఒంటిపై బంగారం దోచుకెళ్ళిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. డాక్టర్ వేషధారణలో వచ్చిన మహిళ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆమె తిరిగి వెళ్లినదారిలో నిందితురాలు కోసం గాలింపు చేపట్టారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో డొల్లతనం బయట పడగా.. బయట నుంచి డాక్టర్ వేషధారణలో..
సికింద్రాబాద్‌లో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. కోర్సు కంప్లీట్ చేసి ఆసుపత్రుల్లో సేవ చేయాల్సిన నర్సింగ్ స్టూడెంట్.. నేరాలకు పాల్పడినట్టు బయటపడటం కలకలం రేపుతోంది. మంగళవారం టాస్క్‌ఫోర్స్, మార్కెట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నర్సుగా వేషం వేసుకుని రోగులను మోసం చేస్తూ బంగారం దోచుకుంటున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఆమెకు సహకరించిన భర్తను కూడా అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గౌండ్ల శిరీష(25) ఫార్మ్-డి చదువుతున్న విద్యార్థిని. ఆమె భర్త ఎడులపల్లి సాయి కుమార్ గౌడ్(30). శిరీష ఆసుపత్రుల్లో నర్సుగా నటిస్తూ లోనికి ప్రవేశించేది. ముఖ్యంగా వృద్ధ మహిళలను టార్గెట్‌గా చేసుకుని.. వారికి డయాజిపామ్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అపస్మారక స్థితిలోకి నెట్టేది. ఆ తర్వాత వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అపహరించి అక్కడి నుంచి పరారయ్యేది. ఈ తరహా ఘటనలు సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి, చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో జరిగినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు, ఒక కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్, చందానగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ఆసుపత్రుల్లో భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోగుల భద్రతకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
Also read
- ఈ ఆలయంలో మీ ప్రశ్న నిజమైతే ‘శిల’ తిరుగుతుంది! – ‘శివాజీ’ యుద్దానికి వెళ్లేముందు ఇక్కడికి వచ్చేవారట!
- సముద్రపు అలలు చేసే శివాభిషేకం.. పాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాల ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భూమి నుంచి ఆకాశం వరకు పరమశివుని పంచభూత క్షేత్రాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే!
- Hyderabad: ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం.. గంజాయి మత్తులో యువకుల హల్చల్
- మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం




