ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అయోధ్య జిల్లాలోని పురా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగ్లా భారీ గ్రామంలో గురువారం (అక్టోబర్ 9) రాత్రి ఒక ఇంట్లో పేలుుడు సంభవించింది. శక్తివంతమైన పేలుడు ధాటికి ఇల్లు కుప్పకూలిపోయింది, శిథిలాల కింద చిక్కుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పేలుడు గురించి సమాచారం అందిన వెంటనే, SSP, CO సహా పలువురు సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
జేసీబీని ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో బాణసంచా పేలుడు సంభవించిందని తెలుస్తోంది. అయితే పోలీసులు, స్థానిక అధికారులు ఈ విషయంపై ఇంకా ఎటువంటి సమాచారం అందించలేదు. సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నప్పుడు, పోలీసులు పేలిన సిలిండర్, కుక్కర్‌ను కనుగొన్నారు. ఈ సంఘటన తర్వాత ఐదుగురిని ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఐదుగురు మరణించారని, మృతుల్లో ముగ్గురు పిల్లలు, మరో ఇద్దరు ఉన్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయ బృందాలు శ్రమిస్తున్నాయి. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది
Also read
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*





