సిద్దిపేట జిల్లాలో భారీ దొంగతనం కలకలం రేపింది. అర్థరాత్రి ఎవరూ లేని ఇంట్లోకి దూరిన కొందరు దుండగులు.. ఇంట్లోని లాకర్‌ను ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. మార్నింగ్ ఇల్లు క్లీన్ చేసేందుకు వచ్చిన పనిమనిషి తాళాలు పగిలిపోయి ఉండడాన్ని చూడడంతో అసలు విషయం వెలుగలోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భారీ చోరీ తీవ్ర కలకలం రేపింది. నగరంలోని15వ వార్డులోని నివాసం ఉంటున్న చింత రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు.. లాకర్ లను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాకలో మెడికల్ ఏజెన్సీ నడుపుతున్న రాజ్ కుమార్ 9 రోజుల క్రితం కుటుంబంతో కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు.
అయితే సోమవారం మార్నింగ్ వాళ్ల ఇంట్లో పనిచేసే మహిళ ఇంటిని శుభ్రం చేసేందుకు రాగా అప్పటికే ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పనిమనిషి యజమానికి సమాచారం అందించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.
ఇక విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ కాశీ నుంచి హుటాహుటిన దుబ్బాక బయలుదేరారు. ఇక ఆయన వస్తేనే ఇంట్లో ఉన్న బంగారం ఎంత పోయింది ఎంత అనేది క్లారిగా తెలియనుంది. చోరీ జరిగిన ప్రదేశాన్ని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ పరిశీలించారు. ఐరన్ రాడ్డుల సహాయంతో తాళాన్ని పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారని.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
Also read
- వెంటాడి.. వేటాడి రౌడీషీటర్ హత్య
- ఠాణాలో భార్యపై కత్తితో దాడి
- తొలి ఏకాదశి.. విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సిన పరిహారాలు ఇవే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- స్లిమ్ చేస్తానని నమ్మించి.. యువతిని హోటల్ రూమ్‌కు రప్పించిన జిమ్ ట్రైనర్.. ఆపై..!





