SGSTV NEWS online
CrimeNational

పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి రైతు మాయం.. తెల్లారి ఊరంతా కలకలం! కట్ చేస్తే బిత్తరపోయిన జనం



ఆకాపూర్ గ్రామానికి చెందిన రైతు వాసుదేవ్ ఓరే (55) పొలానికి నీరు అందించేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు గ్రామస్థుల సాయంతో పొలం పరిసరాల్లో వెతికారు. ఆచూకీ దొరకకపోవడంతో శనివారం గాలింపు చేపట్టారు. ఇంతలో పొలానికి దూరంగా ఏదో వింత ఆకారం కనిపించడంతో..

తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో పులుల దాడులు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్ర చంద్రపూర్ లో మనుషులపై పులుల దాడులు చేస్తుంటే.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పశువులను పొట్టన పెట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గాదిగూడలో పశువుల మందపై పులి దాడి చేసి నాలుగు పశువులను‌ హతం చేసింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నాగ్ భీడ్‌లో ఓ రైతును పొట్టన పెట్టుకుంది పులి. పులుల దాడులతో సరిహద్దు ప్రాంతం భయంతో వణికిపోతోంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని చంద్రపూర్ జిల్లా నాగ్ భీడ్ లోని వణి తాలూకా ఆకాపూర్ గ్రామానికి చెందిన రైతు వాసుదేవ్ ఓరే (55) పై పులి దాడి చేసి చంపేసింది. నాగభీడ్ ఎఫ్ఆర్ఓ షాహు తెలిపిన వివరాల ప్రకారం..

ఆకాపూర్ గ్రామానికి చెందిన రైతు వాసుదేవ్ ఓరే (55) పొలానికి నీరు అందించేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు గ్రామస్థుల సాయంతో పొలం పరిసరాల్లో వెతికారు. ఆచూకీ దొరకకపోవడంతో శనివారం గాలింపు చేపట్టారు. పొలానికి కొద్ది దూరంలో అతని మృతదేహం కనిపించింది. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఎఫ్ఆర్వో షాహు తన బృందంతో పాటు పోలీసుల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పులి‌దాడి కారణంగానే వాసుదేవ్ మృతి చెందినట్టుగా గుర్తించారు.

ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో పులి సంచారం దడ పుట్టిస్తుంది. పశువులపై తరచూ దాడులకు తెగబడుతుండటంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం ఖడోలి గ్రామ శివారులోని మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో నాలుగు పశువులపై పెద్ద పులి దాడి చేసి చంపేసింది. ఖడోలి గ్రామానికి చెందిన రైతు గెడం తులసీ రాంకు చెందిన మూడు ఆవులు, ఒక లేగ దూడపై పులి దాడి చేసింది. విషయం తెలుసుకున్న అటవిశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.

Also read

Related posts